DELHI: ప్రపంచంలోనే కాలుష్య నగరంగా ఢిల్లీ
కాలుష్య కోరల్లో చిక్కుకుని ఢిల్లీ వాసులు(Delhi residents) అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని వాసులను మరో వార్త మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం(world's most polluted city)గా దేశ రాజధాని ఢిల్లీ కొనసాగుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుత కాలుష్య స్థాయిలు( pollution levels) ఇదే విధంగా కొనసాగితే ఢిల్లీ ప్రజల ఆయుర్దాయంలో 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని(11.9 years of life ) కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌లో ఈ వివరాలను పొందుపరిచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ( World Health Organization) నిర్దేశించిన దాని కంటే ఢిల్లీలో కాలుష్య స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం తెలిపింది. భారత్‌లో 67.4 శాతం మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పీఎం 2.5 కారణంగా దేశ ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందని ( average Indian's life expectancy by 5.3 years) ఈ నివేదిక సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొన్న AQLI.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడున్న కోటీ 80 లక్షల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కారణంగానే కోల్పోనున్నారని తెలిపింది.
అత్యంత తక్కువ కాలుష్యమున్న జిల్లాగా గుర్తింపు పొందిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా( Pathankot in Punjab)లోనూ ప్రమాదకర కాలుష్య స్థాయిలు పీఎం 2.5గా ఉంది. ఇది W.H.O ప్రమాణాల కంటే 7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల ఆయుష్షు కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది. ఉత్తరాదిన కాలుష్యానికి భౌగోళిక, వాతావరణ అంశాలు కారణమైనప్పటికీ మానవ ప్రమేయంతోనూ భారీ స్థాయిలో కాలుష్యం పేరుకుపోతోందని తెలిపింది.
దేశంలో మిగతా ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడి జనాభా సాంద్రత మూడురెట్లు ఎక్కువగా ఉండటం, తద్వారా వాహనాలు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ సంబంధిత పనులతో కాలుష్యం మరింతగా పెరిగిపోతోందని పేర్కొంది. కాలుష్యం కారణంగా బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేసియా దేశాల్లోని ప్రజలు ఒకటి నుంచి ఆరేళ్లకుపైగా తమ జీవితకాలాన్ని కోల్పోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com