Rajya Sabha: ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Rajya Sabha: ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించిన రాజ్యసభ.... అనుకూలంగా 132, వ్యతిరేకంగా 102 ఓట్లు

కేంద్ర ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. వివాదాస్పద ఢిల్లీ సర్వీసుల బిల్లు(National Capital Territory of Delhi (Amendment) Bill )కు రాజ్యసభ ఆమోదం (Rajya Sabha passes) తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాల మధ్యే దేశ రాజధానిలో ప్రభుత్వ సీనియర్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) బిల్లు- 2023ను రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. కాంగ్రెస్‌, ఆప్‌ సహా విపక్షాలు ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని విమర్శించాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా( Union Home Minister Amit Shah) ఆ తర్వాత విపక్షాల అభ్యంతరాలకు సమాధానం చెప్పారు. చివర్లో తీర్మానంపై ఓటింగుకు విపక్షాలు పట్టుపట్టాయి. అనంతరం సభాపతి ఓటింగ్‌ నిర్వహించారు.


ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 131( support of 131 MPs), వ్యతిరేకంగా 102 ఓట్లు( 102 MPs voted against) వచ్చాయి. దీంతో ఢిల్లీ సర్వీసుల బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో విపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన పార్టీల్లో భారాస కూడా ఉంది. వైసీపీ, బిజు జనతాదళ్‌ సభ్యులు బిల్లుకు మద్దతు( support of the members from BJD and YSRCP) పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. అనారోగ్యంతో ఉన్న జేఎంఎం అగ్రనేత శిబు సోరెన్‌ కూడా ఓటింగులో పాల్గొన్నారు.


ఢిల్లీ సర్వీసుల బిల్లుకు ఎగువ సభ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ముగ్గురు సభ్యులు ఎటూ తేల్చుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనలేదు.


ప్రజల హక్కుల్ని పరిరక్షించడానికి, సమర్థమైన, అవినీతిరహితమైన పాలనను అందించడానికే ఈ బిల్లును తీసుకువచ్చామని అమిత్‌షా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉండే ఒక్క నిబంధనను కూడా ఏ కోణంలోనూ బిల్లులో చేర్చలేదని వెల్లడించారు. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన రెండు తీర్పులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story