Agra: లైంగిక వేధింపుల కేసులో ఢీల్లీ బాబా అరెస్ట్

Agra: లైంగిక వేధింపుల కేసులో ఢీల్లీ బాబా అరెస్ట్
X
50 రోజులుగా పరారీలో ఉన్న చైతన్యానంద సరస్వతి

ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో 17 మంది మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి చైతన్యానంద బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అనే ప్రైవేటు నిర్వహణ సంస్థ ‘డైరెక్టర్’గా ఉన్నాడు. మహిళలకు అసభ్యకరమైన టెక్స్ట్ సందేశాలు పంపడం, లైంగిక వేధింపులు చేస్తున్నారనే ఆరోపణలతో అతడి అరెస్ట్ చేశారు ఆగ్రా పోలీసులు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో 17 మంది మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో స్వామి చైతన్యానందను అరెస్ట్ చేశారు పోలీసులు. 50 రోజులుగా పరారీలో ఉన్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిని ఆగ్రాలోని తాజ్ గంజ్‌లోని హోటల్ అరెస్ట్ చేశారు. ఢిల్లీ బాబా ఆర్థికంగా బలహీన వర్గాల కేటగిరీలో స్కాలర్‌షిప్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ డిప్లొమా విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు ప్రారంభంలో 17 మంది మహిళలు సంయుక్తంగా డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. మహిళలకు అసభ్యకరమైన టెక్స్ట్ సందేశాలు పంపడం, లైంగిక వేధింపులు చేస్తున్నారనే ఆరోపణలతో అతడి అరెస్ట్ చేశారు ఆగ్రా పోలీసులు.

ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం నుండి సంస్థకు ఫిర్యాదు అందిన వెంటనే ఆగస్టు 4న అతను పారిపోయాడు .ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి చైతన్యానంద విద్యార్థులను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఒక పూర్వ విద్యార్థి నుండి ఒక లేఖ అందింది . మరుసటి రోజు, ఎయిర్ ఫోర్స్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అధికారి నుండి ఇన్స్టిట్యూట్‌కు ఇమెయిల్ వచ్చింది. ఈ ఇమెయిల్ బాబా తమను బెదిరిస్తున్నారని, అభ్యంతరకరమైన సందేశాలు పంపుతున్నారని ఆరోపిస్తూ అనేక మంది విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. ఇన్స్టిట్యూట్‌లోని చాలా మంది విద్యార్థులు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కుటుంబాల నుండి వచ్చినందున.. ఈ విషయంపూ ఎయిర్ ఫోర్స్ డైరెక్టరేట్ జోక్యం చేసుకుంది.

Tags

Next Story