Swati Maliwal: అత్యాచార బాధిత బాలికను కలిసే వరకు కదలను

Swati Maliwal: అత్యాచార బాధిత బాలికను కలిసే వరకు కదలను
ఆసుపత్రిలో నేలపైనే నిద్రించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్

ఢిల్లీ అత్యాచార బాధిత బాలికను , ఆమె తల్లిని కలవకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ తన ఆందోళన కొనసాగిస్తున్నారు. బాధితురాలు చికిత్స పొందుతున్న ఆసుపత్రి ప్రాంగణంలో రాత్రంతా ఉండి అక్కడి నేలపైనే నిద్రించారు. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని, బాధిత బాలికను కానీ, ఆమె తల్లిని కానీ కలుసుకునేందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. ఇంకా తన నుంచి వారు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.

బాధిత బాలికను కలిసేందుకు తనను అనుమతించాల్సిందిగా బాలల హక్కుల కమిషన్ (ఎన్సీపీసీఆర్)ను కోరినట్టు తెలిపారు. ఎన్సీపీసీఆర్ చీఫ్ బాధిత బాలిక తల్లిని కలిసినప్పుడు తననెందుకు అడ్డుకుంటున్నారని స్వాతి ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం నుంచీ ఆసుపత్రిలోనే ఉన్న ఆమె బాధితురాలిని కలిశాకే అక్కడి నుంచి కదులుతానని స్పష్టం చేశారు.


ఢిల్లీకి చెందిన ప్రభుత్వ అధికారి ప్రేమోదరు ఖాఖా తన స్నేహితుడి మారణం తరువాత అతని మైనర్‌ కుమార్తె బాగోగులు తను చూసుకుంటానని చెబుతూ అక్టోబర్‌ 2020లో ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. తరువాత నుంచి 2021 జనవరి వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పధ్నాలుగేళ్ల ఆ అమ్మాయి గర్భందాల్చింది. ఆ గర్భం పోయేందుకు ఖాఖా భార్య యువతికి అబార్షన్‌ మాత్రల్ని ఇచ్చింది. తరువాత బాలిక ఇంటికి వెళ్ళిపోయింది.. అయితే ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న బాలిక తీవ్ర భయానికి గురై అనారోగ్యంతో సెయింట్ స్టీఫెన్స్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ కౌన్సెలర్‌కు తన బాధను వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ కమిషనర్‌ ఫర్‌ ఉమెన్‌ (డిసిడబ్య్లు) చీఫ్‌ స్వాతి మలివాల్‌ ఆ అధికారిని వెంటనే అరెస్టు చేయాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఖాఖాను, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు.


చేశారు. 51 ఏళ్ల ప్రేమోదయ్ ఖాఖా, 50 ఏళ్ల ఆయన భార్య సీమారాణిలపై ఈ నెల 13వ తేదీన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, నార్త్ ఢిల్లీ డీసీపీ సాగర్ సింగ్ కల్సి తెలిపారు.అరెస్టు చేయడానికి ముందు ప్రమోదయ్‌ ఖాఖాను అసిస్టెంట్ డైరెక్టర్ పదవి నుంచి సస్పెండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story