రెండేళ్లలో 22 శాతం పెరిగిన ఢిల్లీ తలసరి ఆదాయం

రెండేళ్లలో 22 శాతం పెరిగిన ఢిల్లీ తలసరి ఆదాయం

ఢిల్లీ తలసరి ఆదాయం రెండేళ్లలో 22 శాతం పెరిగి 2021-22లో రూ.3,76,217 నుంచి 2023-24లో రూ.4,61,910కి చేరిందని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం మార్చి 4న రాష్ట్ర అసెంబ్లీలో 2024-25 బడ్జెట్‌ను సమర్పించనుందని ఆమె తెలియజేశారు.

"జనవరి-డిసెంబర్ 2023లో ఢిల్లీ ద్రవ్యోల్బణం రేటు 2.81 శాతంగా ఉంది. అదే కాలంలో జాతీయ ద్రవ్యోల్బణం రేటు 5.65 శాతంగా ఉంది" అన్నారు.

"ఢిల్లీ రెవెన్యూ మిగులు 2021-22లో రూ. 3,270 కోట్ల నుండి 2022-23లో రూ. 14,457 కోట్లకు పెరిగింది. దేశంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మాత్రమే మిగులు ప్రభుత్వం" అని అతిషి మర్లెనా తెలిపారు

Tags

Read MoreRead Less
Next Story