డెలివరీ బాయ్ పేషెంట్‌గా మారి, డాక్టర్‌ని కత్తితో బెదిరించి..

ముంబయిలోని పెద్దర్ రోడ్ ప్రాంతంలో 70 ఏళ్ల వైద్యుడి వద్ద 23 ఏళ్ల డెలివరీ బాయ్ పేషెంట్‌గా నటిస్తూ కత్తితో బెదిరించి దోచుకున్నందుకు అరెస్టయ్యాడు.
ముంబైలోని పెద్దర్ రోడ్ ప్రాంతంలో గురువారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు డెలివరీ బాయ్ ని అరెస్టు చేశారు.
యూపీకి చెందిన అర్జున్ సోంకర్ వర్లీలో నివసిస్తున్నాడు. ఫుడ్ యాప్ స్విగ్గీకి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది మే నుంచి స్విగ్గీతో కలిసి పనిచేస్తున్నాడు.
సోంకర్ రోగిలా నటిస్తూ డాక్టర్ మందాకిని పిరంకర్ క్లినిక్‌కి వెళ్లి ఈ ఘనకార్యం చేశాడు. పిరంకర్ గత 25 సంవత్సరాలుగా తన భాగస్వామి అయిన మరో లేడీ డాక్టర్‌తో కలిసి క్లినిక్‌ని నడుపుతోంది. సోంకర్ తనను అవినాష్ పాశ్వాన్ అని డాక్టర్‌కు పరిచయం చేసుకుని, తనకు అనారోగ్యంగా ఉందని చెప్పాడు. డాక్టర్ అతనికి తక్కువ రక్తపోటు ఉన్నట్లు నిర్ధారించారు. అతడిని ఆసుపత్రిలో చేరమని కోరుతూ రిఫరెన్స్ నోట్ రాశారు. సోంకర్ డాక్టర్ ఫీజు రూ. 200 చెల్లించి బయటకు వచ్చాడు.
అయితే, కొన్ని సెకన్లలో అతను తిరిగి వచ్చి, ఒక సంచిలో నుండి వంటగదిలో ఉపయోగించే కత్తిని తీసి డాక్టర్ గొంతుపై పెట్టి, ఆమెను నిశ్శబ్దంగా ఉండమని బెదిరించాడు. అనంతరం రూ.లక్ష విలువైన బంగారు గొలుసు, లాకెట్‌ను తీసి ఇమ్మన్నాడు. డాక్టర్ భయపడిపోడు అతడు చెప్పినట్లుగానే చేసింది. నిందితుడు పారిపోయే ముందు ఆమెను తోసేశాడు.
"నిందితుడు తన బ్యాగ్‌ను, డైరీలో చేతితో రాసిన నోట్ ను వదిలిపెట్టి వెళ్లాడు. నోట్ లో క్షమించండి అని ఉంది. అతని ఉద్దేశ్యం వైద్యుడిని దోచుకోవడమే. పారిపోయేముందు ఒక స్విగ్గీ టీ-షర్ట్ కూడా క్లినిక్‌లో వదిలిపెట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com