Shah Rukh Khan: షారూఖ్ కు యాసిడ్ బాధితురాలి అభ్యర్థన..!

Shah Rukh Khan: షారూఖ్ కు యాసిడ్ బాధితురాలి అభ్యర్థన..!
X
మీర్ ఫౌండేషన్ యాసిడ్ దాడికి గురైన వారి ఆపరేన్ కు సరిపడా నిధులను సమకూరుస్తుంది


యాసిడ్ దాడికి గురైన ఓ మహిళ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ సహాయాన్ని కోరింది. దాడిలో తన కుడి కన్ను గాయపడిందని ప్రగ్యా ప్రసూన్ తెలిపింది. కన్ను రెప్ప వేయలేకపోవడం, కన్ను పనిచేయకపోవడం వలన బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడం కుదరలేదని తెలిపింది. ఇందుకుగాను షారూఖ్ ఖాన్ నడిపిస్తున్న మీర్ ఫౌండేషన్ సహాయాన్ని కోరింది. ఇందుకుగాను బుధవారం షారూఖ్ కు ట్వీట్ చేసింది. ఇప్పటివరకు షారూఖ్ ట్వీట్ కు స్పందించలేదు.

షారూఖ్ నడిపిస్తున్న మీర్ ఫౌండేషన్ యాసిడ్ దాడికి గురైన వారి ఆపరేన్ కు సరిపడా నిధులను సమకూరుస్తుంది. వారికి పునరావాసం లాంటి చర్యలను అందిస్తుంది. షారూఖ్ అతని తండ్రి మీర్ తాజ్ మహ్మద్ ఖాన్ పేరు మీద ఫౌండేషన్ ను నడిపిస్తున్నాడు.

బాధితురాలు ప్రగ్యా తన బాధను మీర్ ఫౌండేషన్ కు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. యాసిడ్ దాడి తర్వాత తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే హక్కు తనకుందని తెలిపింది. బ్యాంకు ఖాతా కోసం వెలితే కన్ను బ్లింక్ చేయనందువలన ఖాతా ఓపెన్ చేయడానికి అధికారులు ఒప్పుకోలేదని చెప్పింది. తన కన్ను ఆపరేషన్ కోసం సహాయం చేయాలని షారూఖ్ ను కోరింది.

Tags

Next Story