అయోధ్య రామాలయానికి భారీగా తరలి వస్తున్న భక్తులు

అయోధ్య రామాలయానికి భారీగా తరలి వస్తున్న భక్తులు
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుక్షణమే భక్తులు అక్కడికి వెళ్లేందుకు క్యూ కట్టేస్తున్నారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుక్షణమే భక్తులు అక్కడికి వెళ్లేందుకు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పుడే రావద్దు.. కొన్ని రోజులు ఆగండి అని ప్రధాని చెప్పినా వినిపించుకోకుండా తమ దారిన తాము పయనమవుతున్నారు. అయోధ్యపై మీడియాలో వచ్చిన వార్తలు, ప్రచారం వాళ్లని ఒక్కక్షణం కూడా కాలు నిలవనివ్వలేదు.. ఏది ఏమైనా సరే అయోధ్యను ఇప్పుడే సందర్శించాలి అని కంకణం కట్టుకున్నట్టున్నారు.. భారీగా భక్తులు తరలివస్తున్నారు. భారీగా భక్తులు తరలివస్తారని అది వరకే ఆలయ ట్రస్ట్ అంచనా వేసింది.

మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. వీరిలో ఎక్కువ మంది సోమవారం ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు వచ్చి అక్కడే ఉన్నారు. స్వామిని మరోమారు దర్శించుకునేందుకు వేచి చూస్తున్నారు. ఆలయం వద్ద బారులు తీరిన భక్తులలో పెద్ద సంఖ్యలో సాధువులు ఉన్నారు.

ఆలయ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రద్దీ ఏర్పడిందని, తగిన భద్రత కల్పించాలని, ఏర్పాట్లను కొనసాగించాలని వారు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. "స్థానిక ప్రజలు దర్శనం కోసం రావడం ప్రారంభించినప్పుడు పగటిపూట ఎక్కువ రద్దీ ఉంటుందని భావిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story