Sabarimala : శబరిమలకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర క్యూలైన్

Sabarimala : శబరిమలకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర క్యూలైన్
X
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర క్యూలైన్

అయ్యప్పకు ఇరుముడులు చెల్లించుకోవడంతోపాటు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక సోమవారం నుంచి అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల వరకు భారీ క్యూ కూడా ఉండడంతో దర్శనానికి 11 గంటల సమయం పడుతుంది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు కూడా లేవని భక్తులు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కార్తీక చివరి సోమవారం కావడంతో అయ్యప్ప భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రధానంగా మకరవిళక్కు పూజ కోసం శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అయ్యప్ప దర్శనానికి వెళుతున్నారు.

తెల్లవారుజామున 6 గంటల సమయం స్వామివారి దర్శనానికి మొదటిరోజు పట్టింది. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. భక్తులు నడకదారిలో మెట్లపై అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి వెళుతుంటారు. అయితే మొదటి రోజు లక్షన్నర మంది భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతించారు. నవంబర్‌ 27న రాత్రి 10 గంటలకు శబరిమల ఆలయం మండల పూజ కోసం మూసివేస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 30న మకరవిళక్కు పూజ కోసం తిరిగి తెరుస్తారు. జనవరి 14వ తేదీన మకర దర్శనం జరుగుతుంది.

మొదటి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి దర్శనాలకు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం ప్రారంభం నుంచి 41 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి ఇరుముడులు సమర్పించడానికి అయ్యప్ప భక్తులు వెళ్తూ ఉంటారు.

శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరేవారికి కీలక అలెర్ట్‌. అయ్యప్ప భక్తులు ఇకపై ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్ లో మాత్రమే ఇరుముడులు పెట్టుకోవడానికి అనుమతించరు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెకి ఇన్ లగేజ్ లో మాత్రమే తీసుకెళ్లాలి. అందుకే చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story