Maharashtra : చేపలు తింటే ఐశ్వర్య రాయ్‭ అందం మీ సొంతం

Maharashtra : చేపలు తింటే ఐశ్వర్య రాయ్‭ అందం మీ సొంతం
మత్య్సకారుల సమావేశంలో మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం.

రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా మారుతుంది. కళ్లు మెరిసిపోతాయి. మీరు ఎవరినైనా ఆకర్షించే ఆకర్షించే అంత అందంగా తయారవుతారు. ఈ మాట ఏ బ్యూటీ పార్లర్ వాళ్ళు, లేదంటే బ్యూటీ ప్రోడక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లో చెప్పలేదు సాక్షాత్తు మంత్రి గారు చెప్పారు. ఫ్లోలో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు విపక్షాల విమర్శలు చిక్కుకున్న ఆ మంత్రి మహారాష్ట్రకు చెందినవారు.

నోరొక్కటి చాలు మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే దానిని అదుపులో పెట్టుకోవాలి అంటారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ గాని రాజకీయ నాయకులు గాని ఆచితూచి మాట్లాడితే అందంగా ఉంటుంది కాస్త నోరు జారమా వార్తల్లోకి ఎక్కిపోతారు. విమర్శల పాలు అవుతారు. ఇంతకీ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలోకి ఎక్కిన వ్యక్తి మహారాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్‌కుమార్‌ గవిత్‌.


ధూలే జిల్లాలోని అంతుర్లీలో గిరిజన మత్స్యకారులకు చేపల వేట సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్బంగా ప్రజలకు ఆహారం.. అందులో తీసుకోవాల్సిన ఇతర పదార్థాల గురించి వివరించారు. ఇలా వివరిస్తూ ఒక వింతైన పోలిక పోల్చారు. నిత్యం మనం తినే ఆహారంలో చేపలను తప్పకుండా ఉండేలా చూసుకోవాలని సూచన ఇచ్చారు. రోజూ చేపలు తినేవారి చర్మం చాలా మృదువుగా మారుతుందని తెలిపారు. అంతే కాకుండా కళ్లు కూడా మెరుస్తాయని పేర్కొన్నారు. ఇతరులు ఎవరైనా చూస్తే వారు మీ పట్ల ఆకర్షణకు లోనవుతారని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఐశ్వర్యరాయ్ మంగుళూరులోని బీచ్ సమీపంలో నివసించేది, ఆమె చేపలను ఇష్టంగా తినేది. ఐశ్వర్యరాయ్ లాంటి అందమైన కళ్లు కావాలంటే రోజూ చేపలు తినండి అన్నారు.

చేపలు, చేపలు తినడం వల్ల ఉండే ఉపయోగం, వాటిలో ఉండే నూనెలు లాంటి విషయాలలో ఆయన చెప్పినది నిజమే కావచ్చు. కానీ వీటన్నింటికీ ఐశ్వర్య రాయికి లింకు పెట్టడమే ఇప్పుడు సమస్యగా మారింది.మంత్రి వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి పనికి రాని మాటలు చెప్పి కాలం వెళ్లదీసే బదులు.. గిరిజనుల సమస్యలపై మంత్రి దృష్టి సారించాలని హితవు పలికారు. ఇదే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే నితేశ్‌ రాణే వ్యంగ్యంగా స్పందించారు. తాను రోజూ చేపలు తింటానని.. తన కళ్లు కూడా ఐశ్వర్యరాయ్‌ కళ్ల లాగా మారే అవకాశం ఉందా అని మంత్రిని ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు రెండు వర్గాలుగా మారి మంత్రి చెప్పింది కరెక్టేనని కొందరు, ఓ మంత్రి పదవిలో ఉండి చేయాల్సింది ఇలాంటి వ్యాఖ్యలేనా అని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story