తొమ్మిది నెలలుగా ఆ గ్రామంలో డిజిటల్ డిటాక్స్..

తొమ్మిది నెలలుగా ఆ గ్రామంలో డిజిటల్ డిటాక్స్..
జేబులో డబ్బుల్లేకపోయినా పర్లేదు కానీ చేతిలో మాత్రం ఫోన్ ఉండాలి.

జేబులో డబ్బుల్లేకపోయినా పర్లేదు కానీ చేతిలో మాత్రం ఫోన్ ఉండాలి. టెక్నాలజీకి ఎంతగా అడిక్ట్ అయ్యామంటే టైమ్ కి తిండి, నిద్రకూడా కరువయ్యాయి. పక్కవాళ్లతో మాట్లాడడం కూడా మానేశాం. ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కొక్కరికీ ఒక్కో ఫోన్. ఇంట్లో వాళ్లతో మాట్లాడకుండా బయట వాళ్లకు ఫోన్ చేసి మరీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, అస్తమాను చాట్.. ఇదీ వరస.. ఇలానే ఉంటే దేశం ఏమైపోతుంది. మార్పు మన నుంచే ప్రారంభం కావాలని భావించారు గ్రామ పెద్ద అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. గ్రామ పెద్ద నిర్ణయాన్ని ఊరంతా గౌరవించింది..

మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నాం. వాటిని తిరిగి పొందాలని సంకల్పించారు. అందుకోసం టీవీ, స్మార్ట్‌ఫోన్ల నుండి కొంత సమయం విరామం తీసుకోవాలనుకున్నారు.

రాష్ట్ర రాజధాని ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మోహిత్యాంచే వడ్గావ్ అనే గ్రామంలోని భైరవనాథ్ ఆలయంపై ఏర్పాటు చేసిన సైరన్ 45 సెకన్ల పాటు మోగుతుంది. అది విని ఎక్కడి వారు అక్కడ గప్ చుప్.

సైరన్ మోత వినగానే గ్రామస్థులంతా ఎక్కడి వారక్కడ టీవీలు కట్టేసి కుటుంబంలోని వ్యక్తులతో మంచి చెడూ మాట్లాడుకోవడం, పిల్లలు చేతిలో ఉన్న ఫోన్లు పక్కన పడేసి పుస్తకాలు తీసి చదువుకోవడం మొదలు పెడతారు. గ్రామస్థులు ఎక్కువగా రైతులు, చక్కెర మిల్లు కార్మికులు టెలివిజన్, మొబైల్ ఫోన్ లవైపు గంటన్నర వరకు చూడరు. హాయిగా కబుర్లతో కాలక్షేపం చేస్తారు.

పిల్లలు చదువుకోవడానికి తమ విలువైన సమయాన్ని ఉపయోగిస్తారు. గ్రామంలోని 3,500 మంది నివాసితులు ప్రతిరోజూ ఈ 'డిజిటల్ డిటాక్స్'ను అభ్యసించి ఇప్పటికి తొమ్మిది నెలలు అయ్యింది. ఈ మార్పు తమలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అని గ్రామస్తులు చెబుతున్నారు. పొరుగు గ్రామాలు కూడా ఈ పద్ధతిని ప్రేరణగా తీసుకుని ఆచరించాలని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story