DigiYatra: ఇకపై ఎయిర్‌పోర్టులో క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.. ఇదే కారణం..!

DigiYatra: ఇకపై ఎయిర్‌పోర్టులో క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.. ఇదే కారణం..!
DigiYatra: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేపటి నుంచి డిజియాత్ర సిస్టమ్‌ అందుబాటులోకి రాబోతోంది.

DigiYatra: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేపటి నుంచి డిజియాత్ర సిస్టమ్‌ అందుబాటులోకి రాబోతోంది. టికెట్‌, బోర్డింగ్‌ పాస్‌, డాక్యుమెంట్స్ పట్టుకుని క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా.. ఇకపై నేరుగా టెర్మినల్‌కు చేరుకునేలా డిజియాత్ర యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. డిజియాత్ర యాప్‌లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దీని ఆధారంగా ప్రయాణికులు చెకిన్‌ అయ్యే వీలుంటుందని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సాంకేతిక వ్యవస్థను ఢిల్లీ, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో ప్రారంభించారు.

డిజియాత్ర సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు.. ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌తో లింక్‌ అవ్వాలి. దాని ఆధారంగా డేటాబేస్‌ నుంచి ఇ-కేవైసీ వివరాలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఫేషియల్ రికగ్నేషన్‌ కోసం ప్రయాణికులు ముందుగా సెల్ఫీ తీసుకోవాలి. ఆ తరువాత డిజియాత్ర ఐడీలను విమాన బుకింగ్‌ లేదా బోర్డింగ్‌ పాస్‌తో లింక్ అవ్వాలి. ఇలా చేస్తే చెక్‌పాయింట్ల నుంచి నేరుగా వెళ్లపోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story