Om Birla: తీరు మారే దాకా సభకు రాను!

Om Birla: తీరు మారే దాకా సభకు రాను!
స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసహనం... పార్లమెంట్‌ కార్యకలాపాలు స్తంభించడంపై అసంతృప్తి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session)పదే వాయిదా పడుతుండడంపై లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసంతృప్తి‍(Displeased) వ్యక్తం చేశారు. లోక్‌సభలో సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికార, విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకూ తాను సభలో అడుగు పెట్టబోనని స్పీకర్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన సభాధ్యక్ష స్థానంలో కనిపించకపోవడానికి( skips LS proceedings) అదే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి.


పార్లమెంట్‌ (Parliament) వర్షాకాల సమావేశాలకు మణిపుర్‌ అల్లర్ల (Manipur Issue)’ అంశం ఆటంకం కలిగిస్తోంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా లోక్‌సభ (Lok sabha)లో సభా కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. సభ వరుసగా వాయిదా పడుతుండడంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసహనం చెందారు. సభ సజావుగా సాగే వరకు తాను సమావేశాలకు రాలేనని( stayed away from Lok Sabha proceedings) ఆయన కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది.


దిల్లీలోని అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కోసం తెచ్చిన జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ బిల్లు - 2023ను మంగళవారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల( Opposition and the BJP) ప్రవర్తనతో స్పీకర్‌ ఓం బిర్లా(Lok Sabha Speaker) తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అమిత్‌ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించేశారు. వాటిని సభాధ్యక్షుడి కుర్చీ ముందు విసిరేశారు.


ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన స్పీకర్‌ (Speaker) బుధవారం సభా కార్యకలాపాలకు హాజరు కాలేదు. సభా మర్యాదను స్పీకర్‌ అత్యంత ఉన్నతంగా భావిస్తారని, సభ్యులు కూడా దాన్ని పాటించాలని కోరుకుంటున్నట్లు సభాపతి సన్నిహిత వర్గాలు చెప్పాయి. సభా గౌరవానికి అనుగుణంగా సభ్యులు ప్రవర్తించేవరకు తాను సమావేశాలకు హాజరుకాబోనని బిర్లా స్పష్టం చేశారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

బుధవారం కూడా లోక్‌సభ (Lok Sabha) కార్యకలాపాలు స్తంభించాయి. మణిపుర్‌ అంశంపై విపక్షాలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో పార్లమెంట్‌ ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదా పడుతోంది.

Tags

Next Story