Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు భారీగా బోనస్

11.72 లక్షల మందికి రూ.2,028 కోట్ల చెల్లింపు

రైల్వే ఉద్యోగులకు రైల్వే ఉద్యోగుల మంచి పనితీరు కోసం 78 రోజుల వేతనాన్ని ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్‌’ రూపంలో చెల్లించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో దీంతో సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు రూ.2,028.57 కోట్ల మొత్తం పీఎల్‌బీగా అందనుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విలేకరులకు తెలిపారు. ట్రాక్‌ మెయింటెనర్లు, లోకోపైలట్లు, గార్డులు, స్టేషన్‌ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్‌మేన్, మినిస్టీరియల్‌ సిబ్బందికి బోనస్‌ లభిస్తుందని చెప్పారు. పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్‌ చెల్లింపు ఉపయోగపడుతుందన్నారు. (బోనస్‌పై పరిమితి వల్ల ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 మాత్రమే లభించనుంది.)

కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు సైతం ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం భరిస్తాయి.

119 కి.మీ పొడవైన ఈ రెండవ దశ 3 కారిడార్లుగా విభజించబడింది. ఇందులో 120 స్టేషన్లను కలిగి ఉంటుంది. 120 స్టేషన్లు నిర్మించబడనున్నాయి. తద్వారా ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్ల నుండి నడక దూరంలో మెట్రోను ఉపయోగించుకోవచ్చు. ఇందులో భాగంగా టోక్యో ఉదాహరణను పరిశీలిస్తే, ప్రతి ప్రదేశం నుండి నడక దూరంలో మెట్రో అందుబాటులో ఉంటుంది. చెన్నై మెట్రోలోనూ అదే పద్ధతిని అవలంబిస్తామని తెలిపారు.

Tags

Next Story