DK Shivakumar: కొందరు అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు: డీకే శివకుమార్

కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్యతో ఉన్న విభేదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ఆశిస్తున్న డీకే, ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రంలో ప్రసంగిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో “రాజ్యాంగ సవాళ్లు” అనే శీర్షికతో AICC నిర్వహించిన కార్యక్రమంలో, గాంధీ కుటుంబాన్ని ప్రశంసించారు.
కాంగ్రెస్‌తో తనకున్న అనుబంధం, కాంగ్రెస్‌ను కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను హైలెట్ చేయడానికి ప్రయత్నించారు. 2004లో సోనియా గాంధీ ప్రధాని పదవిని కాదనుకోవడాన్ని ఆయన ప్రశంసించారు. “సోనియా గాంధీని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని రాష్ట్రపతి అడిగినప్పుడు, ఆమె, ‘నాకు అధికారం ముఖ్యం కాదు’ అని అన్నారు. ఒక సిక్కు, మైనారిటీ, ఆర్థికవేత్త దేశాన్ని రక్షించగలరని, ప్రధానమంత్రి కావాలని ఆమె నిర్ణయించుకుంది,” అని ఆయన అన్నారు, దీనిని అసమానమైన రాజకీయ త్యాగం అని అభివర్ణించారు.
ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎవరైనా త్యాగం చేస్తారా.?? ఈ రోజు ఏదైనా చిన్న పదవిని కూడా త్యాగం చేయరు అని అన్నారు. పంచాయతీ స్థాయిలో కూడా చాలా మంది తమ పదవుల్ని వదులకోవడానికి ఇష్టపడరు అని అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని పంచుకుంటారు , కానీ మనలో కొందరు అధికారాన్ని పంచుకోవడానికి అంగీకరించరని అన్నారు. శివకుమార్ ఎవరి పేరును నేరుగా పేర్కొనకపోయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు సీఎం సిద్ధరాయమ్య, ఆయన వర్గాన్ని ఉద్దేశించి అన్నవిగా భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com