Lok Sabha: ఆ ఎంపీ లోక్‌స‌భ‌లో లేకున్నా.. సస్పెండ్

Lok Sabha:  ఆ ఎంపీ లోక్‌స‌భ‌లో లేకున్నా.. సస్పెండ్
సభలోనే లేడు.. కానీ సస్పెండ్‌ చేశారు..

లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాల ఆందోళనతో గురువారం పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లిన సంగ‌తి తెలిసిందే. లోక్‌సభలో నిన్న జరిగిన స్మోక్‌ అటాక్‌ ఘటనపై ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ విప‌క్షాల‌కు చెందిన ఎంపీలు ప‌ట్టుబ‌ట్టారు.

ఈ క్రమంలో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో 14 మంది విపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే డీఎంకే ఎంపీ ఎస్ఆర్ పార్థిబ‌న్ స‌భ‌కు హాజ‌రు కాన‌ప్ప‌టికీ అత‌ని పేరును స‌స్పెండ్ ఎంపీల జాబితాలో చేర్చారు. ఈ విష‌యాన్ని డీఎంకే పార్టీ నాయ‌కులు ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ పార్థిబ‌న్ ప్ర‌స్తుతం చెన్నైలో ఉన్నార‌ని, స‌భ‌కు హాజ‌రు కాలేద‌ని చెప్పారు. దీంతో ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది.

సస్పెండ్ చేసిన ఎంపీలలో ఎస్‌ఆర్ పార్థిబన్ సభలో లేరని.. ఆయన చెన్నైలో ఉన్నారని అని డీఎంకే ఎంపీలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పార్థిబన్‌ ‘సిక్‌ లీవ్‌’లో ఉన్నారు. ఒక ఎంపీ పేరును చేర్చడంలో పొరపాటు జరిగిందని జోషి క్లారిటీ ఇచ్చారు. తప్పుగా పెట్టిన ఎంపీ పేరును తొలగించాలని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామన.. స్పీకర్‌ అందకు అంగీకరించారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఓవరాల్‌గా సస్పెండైన ఎంపీల సంఖ్య 14. 13 మంది లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ సస్పెండ్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను రాజ్యసభ నుంచి మిగిలిన సెషన్లకు సభ చైర్మన్‌ సస్పెండ్ చేశారు. ఇక సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల్లో డీన్ కురియాకోస్, హిబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, బెన్నీ బెహనన్, వీకే శ్రీకందన్, మహ్మద్ జావేద్, పీఆర్ నటరాజన్, కనిమొళి కరుణానిధి, కే సుబ్బరాయన్, ఎస్ ఆర్ పార్థిబన్, ఎస్ వెంకటేశన్, మాణికం ఠాగూర్‌ ఉన్నారు. అంటే 13 మంది ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి 9 మంది, సీపీఎం నుంచి ఇద్ద‌రు, డీఎంకే, సీపీఐ నుంచి ఒక‌రి చొప్పున ఉన్నారు.


Tags

Next Story