Divorce Within 24 Hours: 3 ఏళ్ల ప్రేమ .. పెళ్లైన 24 గంటలకే విడాకులు.. రీజన్ ఏంటంటే..?

మహారాష్ట్రలోని పుణేలో ఓ ప్రేమ పెళ్లిలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన వెంటనే తీవ్రమైన విభేదాలు తలెత్తడంతో, మ్యారేజ్ జరిగిన 24 గంటల్లోనే చట్టబద్ధంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది ఓ నూతన జంట. ఈ ఘటన స్థానికంగా, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
అయితే, పెళ్లికి ముందు ఇద్దరూ మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారని కేసును వాదించిన విడాకుల లాయర్ వెల్లడించారు. వృత్తిరీత్యా యువతి డాక్టర్ కాగా, యువకుడు ఇంజినీర్. కానీ, పెళ్లి తర్వాత ఎక్కడ నివసించాలి? ఎలా జీవనం కొనసాగించాలి? అనే అంశాలపై ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చాయి.. ఈ విషయంలో పరస్పర అంగీకారానికి రాలేకపోవడంతో విడిపోవడమే సరైన నిర్ణయమని ఈ యువ జంట భావించిదని తెలిపారు.
ఇక, ఈ కేసు వాదించిన అడ్వకేట్ రాణి సోనవానే మాట్లాడుతూ.. ఈ కొత్తగా పెళ్లైన జంట మధ్య కాపురం ఎలా ఉండాలనే దాంట్లో విభేదాలు రావడంతో.. పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ఎలాంటి హింస, క్రిమినల్ ఆరోపణలు లేవని వెల్లడించింది. ఇద్దరూ చాలా చట్టపరమైన ప్రక్రియను అనుసరించి, తమ వివాహ బంధాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకున్నారు. కాగా, సాధారణంగా భారత్‌లో విడాకుల కేసులు నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్ల పాటు కోర్టుల్లో పెండింగ్‌లో ఉంటాయి.. కానీ ఈ కేసు మాత్రం అత్యంత వేగంగా పరిష్కారం కావడాన్ని ఆశ్చర్యం కలిగిస్తుందని అడ్వకేట్ రాణి సోనానే పేర్కొన్నారు.
కాగా, పెళ్లి అనంతరం యువకుడు తన భార్యకు ఓ కీలక విషయం వెల్లడించాడు. తాను ఓడలో (షిప్) పని చేస్తాను, దీంతో ఎప్పుడు, ఎక్కడ పోస్టింగ్ వస్తుందో.. ఎంతకాలం పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందో చెప్పలేనని భార్యకు వివరించాడు. ఆ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరూ కలిసి విడిపోవడమే ఉత్తమమని తాము ఈ నిర్ణయానికి వచ్చామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

