Polygraph Test: ఆర్‌జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష?

కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో.. ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 9వ తేదీన వైద్యురాలి శరీరం సెమీనార్ హాల్‌లో పడి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రెండు రోజులకు ప్రిన్సిపాల్ ఘోష్ రాజీనామా చేశారు.
ఇప్పటికే పలుమార్లు ఆయన .. సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఘోష్‌ను మరోసారి విచారించాలనుకుంటున్నామని, తమ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాల్లో తేడా కనిపిస్తున్నదని, అందుకే మరోసారి పరీక్షించాలనుకుంటున్నామని, దానిలో భాగంగానే పాలీగ్రాఫ్ టెస్టు చేయాలనుకుంటున్నట్లు ఓ సీబీఐ అధికారి తెలిపారు. పీజీ విద్యార్థి బాడీని చూసేందుకు పేరెంట్స్‌ను ఎందుకు మూడు గంటల పాటు వెయింటింగ్ చేయించాడన్న అంశంపై సీబీఐ అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే, ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వెనక బడానేతలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సంజయ్ రాయ్ అనే వ్యక్తికి పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు స్థానిక కోర్టు నుంచి సీబీఐ అనుమతి తీసుకున్నది. కాగా, ఆసుపత్రిలో ఆర్ధిక అవకతవకలపై జూన్ లోనే ఫిర్యాదులు నమోదు అయినట్లు మీడియా కథనాలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com