Khalistani terrorist: నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను నవంబర్ 19 న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కులకు సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ టెర్రరిస్టు, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ పన్నూన్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా దిగ్భందిస్తాం. ఆ రోజు ఇండియా విమానాల్లో ప్రయాణించకూడదు..లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ వీడియోలో పేర్కొన్నాడు.
‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.
అలాగే ఆ రోజున ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేస్తారని పన్నూన్ తెలిపాడు. భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని అన్నాడు. అలాగే నవంబర్ 19న జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ ‘ఈ నవంబర్ 19, ప్రపంచ టెర్రర్ కప్ ఫైనల్‌తో సమానంగా ఉంటుంది’ అని ఆ వీడియోలో బెదిరించాడు.
గురుపత్వంత్ సింగ్ పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.ఇతను విదేశాల నుంచి సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను నడుపుతున్నాడు.భయాన్ని వ్యాప్తి చేయడానికి, దేశంలోని సిక్కులు, ఇతర మతాల మధ్య శత్రుత్వం సృష్టించడానికి, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటానికి పన్నూ ప్రయత్నిస్తున్నాడని ఇతనిపై ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. గతంలోనూ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్‌లో అతను ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. సుమారు నెల రోజుల క్రితం కూడా ఖలిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఎలాంటి బెదిరింపులు చేశాడు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ‘వరల్డ్ టెర్రరిస్ట్ కప్’ అని, ప్రపంచ కప్ కాదంటూ ప్రకటించాడు. గురుపత్వంత్‌సింగ్ పన్నూ ప్రస్తుతం అమెరికాకు చెందినటువంటి సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థకు ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతడు సిక్కులకు ప్రత్యేకంగా దేశం కావాలని డిమాండ్ చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com