Bomb Threats : ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

దేశ రాజాధిన ఢిల్లీలో బాంబు బెదిరింపులు మళ్లీ వచ్చాయి. అయితే ఈసారి విమానాలకు కాకుండా పాఠశాలలకు. సోమవారం ఉదయం ఢిల్లీలోని రెండు పాఠశాలల్లో బాంబులు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), పశ్చిమ్ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బాంబు థ్రెట్ వచ్చింది. అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులను ఇండ్లకు పంపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబు స్క్వాడ్‌తోపాటు అగ్నిమాపక సిబ్బంది రెండు స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఉదయం 7 గంటలకు బాంబు బెదిరింపులకు సంబంధించి సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.
కాగా, రెండు నెలల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న పలు సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 21న ఢిల్లీలోని రెండు, హైదరాబాద్, తమిళనాడులోని ఓ సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అక్టోంబర్ 20న సీఆర్‌పీఎఫ్ స్కూల్ ఆవరణలో భారీ పేలుడు కూడా సంభవించింది. దీంతో సమీపంలో ఉన్న పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com