Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో నిందితురాలుడాక్టర్ షాహీనా , 3 రోజులు ఎన్‌ఐఏ కస్టడీకి

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో నిందితురాలైన డాక్టర్ షాహీనాను మూడు రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పాటియాలా కోర్టు అప్పగించింది. గత నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాది ఉమర్ కూడా హతమయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక విషయాలు రాబట్టారు. హర్యానాలోని అల్-ఫలాహ యూనివర్సిటీ వేదికగా డాక్టర్ల బృందం దేశ వ్యాప్తంగా ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్లుగా తేల్చారు.
ఇందులో ముఖ్యంగా డాక్టర్లు షాహీనా, ముజమ్మిల్, ఉమర్ కీలక సూత్రధారులుగా ఉన్నారు. అయితే కుట్ర బయటపడడంతో ఉమర్ తప్పించుకునే ప్రయత్నంలో కారులో ఉన్న బాంబ్‌లు పేలిపోయాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం డాక్టర్లు షాహీనా, ముజమ్మిల్ జైల్లో ఉన్నారు. తాజాగా షాహీనాను మూడు రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

