Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము..

Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము..
Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలో ఆదివాసీ బిడ్డకే అగ్రతాంబూలం దక్కింది.

Draupadi Murmu: భారత దేశం ఒక కొత్త చరిత్రను లిఖించింది.. ఆదివాసీ ఆడబిడ్డను దేశ ప్రథమ పౌరురాలిని చేసింది.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు.. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఘన విజయాన్ని అందుకున్నారు.. ఆమె తన సమీప ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజారిటీ సాధించారు.. తొలి ఆదవాసీ మహిళా రాష్ట్రపతిగా ఆమె రికార్డులకెక్కనున్నారు.

అన్ని రౌండ్లలోనూ ద్రౌపది ముర్ము స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.. మూడు రౌండ్లు ముగిసే సమయానికి ద్రౌపది ముర్ముకు మొత్తం 5లక్షల 77వేలా 777 ఓట్లు వచ్చాయి.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 2లక్షల 61వేలా 62 ఓట్లు పోలయ్యాయి.. ఇక ఈనెల 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. అటు ముర్ము నివాసానికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా.. రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు ద్రౌపది ముర్ముకు భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది.. 200 మందికిపైగా ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఆమెకు ఓటు వేయడం విశేషం.. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రతోపాటు ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, అసోంలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది.. దీంతో అంచనాలకు మించి మెజారిటీని ముర్ము కైవసం చేసుకున్నారు.

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చారిత్రాత్మకమని బీజేపీ నేతలంటున్నారు.. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం సంతోషంగా ఉందంటున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందంటున్నారు.. విపక్ష సభ్యులు సైతం ద్రౌపదికే మద్దతు ఇచ్చారన్నారు.. మధ్యప్రదేశ్‌, మమారాష్ట్రలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందంటున్నారు.. అందువల్లే అంచనా వేసిన దానికంటే ముర్ముకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని బీజేపీ నేతలు చెప్తున్నారు.

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. అన్ని రాష్ట్రాల్లో గిరిజనులు, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.. ద్రౌపది ముర్ము కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచారు.. ద్రౌపది ముర్ముకు విజయంతో గిరిజనులు, ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు..

Tags

Read MoreRead Less
Next Story