Draupadi Murmu: ఉత్కంఠకు తెరపడింది.. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ..

Draupadi Murmu: ఉత్కంఠకు తెరపడింది.. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ..
Draupadi Murmu: ఉత్కంఠకు తెరపడింది. సస్పెన్స్‌కు తెరదించుతూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.

Draupadi Murmu: ఉత్కంఠకు తెరపడింది. సస్పెన్స్‌కు తెరదించుతూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈసారి మహిళా నాయకురాలికి బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. ఒడిషా రాష్ట్రానికి చెందిన గిరిజన నేత అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపింది బీజేపీ.

సంతాల్‌ గిరిజన తెగకు చెందిన మహిళా నాయకురాలైన ముర్ము.. ఒడిషా వాణిజ్య, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌గాను ద్రౌపది ముర్ము పనిచేశారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై మేథోమథనం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాధ్‌ సింగ్, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఉదయం నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ద్రౌపది ముర్ముతో పాటు మరో నేత పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డా చర్చించడంతో ఉపరాష్ట్రపతినే రాష్ట్రపతి చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే చివరికి మహిళకు అవకాశం ఇస్తూ ద్రౌపది ముర్మును ఖరారు చేసింది బీజేపీ. ఇక.. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు జులై 18న పోలింగ్ జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story