Draupadi Murmu: వైభవంగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారోత్సవం..

Draupadi Murmu: వైభవంగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారోత్సవం..
Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారోత్సవం వైభవంగా జరిగింది.

Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ దేశ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్మును.. మాజీ రాష్ట్రపతి స్వయంగా రైజినా హిల్స్‌లోని రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. అక్కడ హై-టీ స్వీకరించిన తరువాత.. సంప్రదాయం ప్రకారం తిరిగి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులను.. జనపథ్‌లో కేటాయించిన ఆయన నివాసంలో దింపి వచ్చారు. ఈ కార్యక్రమాలతో ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం, రాష్ట్రపతిగా బాధ్యతల స్వీకారం పూర్తయ్యాయి.

పార్లమెంట్‌ హాలులో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు ప్రభుత్వంలోని ప్రముఖ సివిల్‌, మిలటరీ అధికారులు కూడా హాజరయ్యారు. ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించిన తొలి తెలుగు సీజేఐగా ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకోగానే.. సైన్యం 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది. అనంతరం పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు ద్రౌపది ముర్ము.

ఆదివాసీ గ్రామం నుంచి తన ప్రయాణం మొదలైందన్న ముర్ము.. వార్డు కౌన్సిలర్‌ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చానని అన్నారు. తమ గ్రామంలో పదో తరగతి చదువుకున్న బాలిక తానేనంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రపతిగా ఎన్నికవడం తన వ్యక్తిగత విజయం కాదని, ఆదివాసీ, దళితుల విజయమన్నారు.దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ప్రమాణస్వీకారానికి వివిధ దేశాల నుంచి దౌత్యవేత్తలు వచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story