బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం అయ్యింది. ఇండియన్ నేవీ ఈ ప్రయోగం జరిపింది. దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్.... చెన్నై నుంచి ప్రయోగించగా అరేబియా సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని చేధించిందని డీఆర్డీఓ ప్రకటించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురితప్పకుండా లక్ష్యాన్ని చేధించిందని ప్రకటనలో తెలిపింది. సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ చేధిస్తుందని డీఆర్డీఓ తెలిపింది. ఈ ఆయుధంతో ఇండియన్ నేవీ బలం మరింత పెరిగిందని.. ప్రధాన ఆయుధంగా సేవలు అందించగలదని పేర్కొంది. ప్రయోగం విజయవంతమైన సందర్భంగా డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డిని, శాస్త్రవేత్తలను, డీఆర్డిఓ, బ్రహ్మోస్, ఇండియన్ నేవీ సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com