స్కూల్ టీచర్స్ కి డ్రెస్ కోడ్.. జీన్స్, లెగ్గింగ్స్ ..

స్కూల్ టీచర్స్ కి డ్రెస్ కోడ్.. జీన్స్, లెగ్గింగ్స్ ..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల డ్రెస్ కోడ్ కోసం అస్సాం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో ఉపాధ్యాయుల డ్రెస్ కోడ్ కోసం అస్సాం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పిల్లలు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు జీన్స్, లెగ్గింగ్స్ ధరించరాదని ప్రభుత్వం కోరింది.

"కొంతమంది ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులను ధరించి స్కూలుకు వస్తున్నారని.. ఇది ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదని పేర్కొంది. ఉపాధ్యాయుడు విద్యార్ధులకు రోల్ మోడల్ గా ఉండాలని.. ముఖ్యంగా వార విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మర్యాదకరమైన దుస్తులు ధరించాలని తెలిపింది.

పని ప్రదేశంలో గంభీరతను ప్రతిబింబించే దుస్తుల కోడ్‌ను అనుసరించడం అవసరం అని విద్యాశాఖ అని పాఠశాలలకు ఆర్డర్స్ పాస్ చేసింది. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు నడుచుకోవాలని ఆదేశించింది. విద్యాశాఖ ఉపాధ్యాయులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

1. పురుష ఉపాధ్యాయులు షర్ట్-ప్యాంట్ ధరించాలి.

2. మహిళా టీచర్లు సల్వార్ సూట్/చీరలో హాజరు కావాలి

ధరించే దుస్తులు నిరాడంబరంగా, మర్యాదగా ఉండాలి.

క్యాజువల్ వేర్ ధరించాలి.

నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలియజేసింది.

Tags

Next Story