Drugs: గోవాలో భారీ‌గా డ్రగ్స్

Drugs: గోవాలో భారీ‌గా డ్రగ్స్
5.2 కేజీల హెరాయిన్ సీజ్

గోవా విమానాశ్రయంలో భారీ‌గా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్నారు అధికారులు. 12 కోట్ల విలువ చేసే 5.2 కేజీల హెరాయిన్ DRI సీజ్ చేశారు. ఓ ప్రయాణికురాలు ఇథియోపియా నుండి హెరాయిన్ తీసుకొస్తుండగా గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. వారి కళ్లు గప్పి ట్రాలీ బ్యాగ్ లో డ్రగ్స్ తీసుకొని బయటకు వచ్చింది ఓ మహిళ. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలించింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ ఓ హోటల్ కు చేరుకుంది.

అప్పటికే అనుమానం వచ్చిన DRI అధికారులు.. ఆ లేడి బస చేస్తున్న హోటల్ వెళ్లి తనిఖీలు చేయగా డ్రగ్స్ లభ్యమయ్యాయి. 12 కోట్ల విలువ చేసే 5.2 కేజీల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ డ్రగ్స్ ను ఢిల్లీలో ఓ వ్యక్తికి అప్ప చెప్పెందుకు ప్రయాణికురాలు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన DRI అధికారులు డ్రగ్స్ రాకెట్ ను గుట్టరట్టు చేశారు.


మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ పై పని చేసి శరీర అవయవాలతో పాటు మెదడు పై ప్రభావం చూపిస్తాయి. సరదాగా చేసుకొనే ఈ అలవాటు ఒక్కోసారి ప్రాణంతకంగా మారుతుంది. వీటిలో కొన్ని రకాల డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా చేస్తాయి. ఒక దశకు వెళ్లిన తర్వాత రాత్రికి, పగటికి తేడా తెలియదు.

ఉదాహరణకు చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలని భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని నొప్పి తెలియకుండా చేస్తాయి. మరికొన్ని నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి.

ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన తర్వాత జీవన శైలి మారిపోతుంది. ఓపియం అంటే నల్ల మందు, కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మేథాడోన్, వికోడిన్, ఆక్సీకోన్టిన్ ఇవన్నీ మాదక ద్రవ్యాల కిందకు వస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story