MODI: ప్రధాని అధికార నివాసంపై డ్రోన్‌ చక్కర్లు

MODI: ప్రధాని అధికార నివాసంపై డ్రోన్‌ చక్కర్లు
ప్రధాని మోడీ అధికార నివాసంపై డ్రోన్‌ చక్కర్లు.... ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది... లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యం మరోసారి కలకలం రేపింది. ప్రధాని అధికారిక నివాసంపై డ్రోన్‌ చక్కర్లు కొట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున 5:30 నిమిషాలకు నో ఫ్లయింగ్‌ జోన్‌లో డ్రోన్‌ ఎగురుతూ కనిపించడం సంచలనం సృష్టించింది. డ్రోన్‌ను గుర్తించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాని నివాసంపై డ్రోన్‌ కనిపించడంపై దర్యాప్తు చేస్తున్నామని... ఇప్పటికే డ్రోన్‌ ఆచూకీ కోసం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇంకా డ్రోన్‌ను గుర్తించలేదని.. సమీప ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నామని వివరించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ని కూడా పోలీసులు సంప్రందించారు. డ్రోన్‌ను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story