ముంచుకొచ్చిన మృత్యువు.. రైలు బెర్త్ మీద పడడంతో కేరళ వ్యక్తి మృతి

జూన్ 16వ తేదీన కేరళకు చెందిన అలీఖాన్ సికె తన స్నేహితుడితో కలిసి ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ మిలీనియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12645లోని స్లీపర్ కోచ్ దిగువ బెర్త్‌లో ఆగ్రాకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్‌పిఎఫ్ తెలిపింది. రైలులో ప్రయాణిస్తుండగా పై బెర్త్ పడిపోవడంతో అలీఖాన్ గాయపడి మృతి చెందాడు.
గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) ప్రకారం , బెర్త్‌లో ఎటువంటి లోపం లేదు కానీ మరొక ప్రయాణీకుడు బెర్త్‌ను సరిగ్గా చైనింగ్ చేయకపోవడం వల్ల ఇది జరిగింది అని వివరణ ఇచ్చారు.
ఈ ఘటన జరిగినప్పుడు రైలు తెలంగాణలోని వరంగల్ జిల్లా మీదుగా వెళుతోంది. బెర్త్ అతడి మీద పడడంతో వ్యక్తి మెడకు గాయాలు అయ్యాయని, అతన్ని మొదట రామగుండంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడని GRP అధికారి తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి (@స్పోక్స్‌పర్సన్ రైల్వేస్) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్‌లో సంబంధిత ప్రయాణీకుడు S6 కోచ్‌లోని సీట్ నంబర్ 57 (లోయర్ బెర్త్)లో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
"పై బెర్త్‌లోని చైన్‌ను సరిగ్గా అమర్చకపోవడం వల్ల పై బెర్త్ సీటు పడిపోయింది. పై బెర్త్ సీటుకు ప్రయాణీకుడు సరిగ్గా చైనింగ్ చేయకపోవడం వల్ల సీటు కిందకి పడిపోయింది" అని పోస్ట్‌లో ఉంది.
సీటు డ్యామేజ్ అయిన స్థితిలో లేదని, కింద పడిపోలేదని, క్రాష్ అవ్వలేదని స్పష్టం చేశారు. నిజాముద్దీన్ స్టేషన్‌లో సీటును తనిఖీ చేయగా అంతా బాగానే ఉందని పోస్టులో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com