Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం..

దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి 7:49 సమయంలో ఝజ్జర్‌లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్టు జాతీయ భూకంప పరిశోధన సంస్థ తెలిపింది. అక్కడ 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఎన్‌సీఎస్ గుర్తించింది. ఢిల్లీకి ఈ ప్రాంతం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గురువారం కూడా ఝజ్జర్‌లో ఉదయం 9:04 సమయంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. శుక్రవారం కూడా ఇదే తరహాలో భూ కంపనాలు ఏర్పడడంతో స్థానికులు కంగారు పడ్డారు. పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఇలా చిన్నపాటి భూకంపాలు రావడం వల్ల భారీ స్థాయిలో డే భూకంపం ఏర్పడే ముప్పు తప్పుతుందని అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com