Earthquake: ఈశాన్య రాష్ట్రాలను వణికించిన భూకంపాలు

Earthquake: ఈశాన్య రాష్ట్రాలను వణికించిన భూకంపాలు
మేఘాలయల్లో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత

ఈశాన్య రాష్ట్రాలను వరుస భూకంపాలు కుదిపేసాయి. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో అక్టోబర్ 2వతేదీన రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారతదేశంలోని గౌహతికి పశ్చిమాన నైరుతి దిశలో 116 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూప్రకంపనలు 10 కిలోమీటర్ల లోతులో సంభవించాయి. ఈశాన్య భారతదేశం, భూటాన్, ఉత్తర బంగ్లాదేశ్ అంతటా భూమి కంపించింది.

మేఘాలయ రాష్ట్రంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. సాయంత్రం 6.15 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రెసుబెల్‌పరా జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ గారో హిల్స్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.


ఆదివారం హర్యానాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం ఆదివారం రాత్రి 11.26 గంటలకు 2.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం హర్యానాలోని రోహ్‌తక్‌కు తూర్పు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మయోన్మార్ లోనూ సోమవారం రాత్రి 7.59 గంటలకు భూకంపం సంభవించింది. 120 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది.

ఈ భూకంపం కారణంగా నష్టం లేదా ప్రాణనష్టం గురించి ప్రాథమిక నివేదికలు ఇంకా అందలేదు. అధికారులు సమగ్ర నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. భూకంపం వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రభావిత ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడానికి ముందు రహదారి పరిస్థితులను చూడాలని అధికారులు వాహనచోదకులకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story