Election Commission: కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈసీ కీలక నిర్ణయం.. వాటన్నింటికీ నో పర్మిషన్..
Election Commission: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలపై విధించిన ఆంక్షలను ఈనెల 22 వరకు పొడిగించింది. పశ్చిమబెంగాల్‌లో ఈనెల 22న జరగాల్సిన నాలుగు మున్సిపల్కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఇండోర్మీటింగ్స్నిర్వహించుకోవచ్చని సీఈసీ తెలిపింది.
సభలో 300 మంది కన్నా తక్కువ లేదా హాలులో 50 శాతం ఉండాలని స్పష్టంచేసింది. అన్ని పార్టీలు కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. కాగా.. ఈనెల 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రచార ర్యాలీలు, రోడ్‌షోలపై విధించిన నిషేధం శనివారంతో ముగియనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com