Sanjay Raut : ఈడీ.. సంజయ్ రౌత్ ఎపిసోడ్..

Sanjay Raut : ఈడీ.. సంజయ్ రౌత్ ఎపిసోడ్..
Sanjay Raut : మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని ఈ నెల 8 వరకు ఈడీ పొడిగించింది

Sanjay Raut : పాత్రచాల్ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని ఈ నెల 8 వరకు ఈడీ పొడిగించింది. కేసు దర్యాప్తులో భాగంగా గణనీయమైన పురోగతిని సాధించిందని అధికారులు పేర్కొన్నారు.

ఆదివారం అర్ధరాత్రి అరెస్టయిన సంజయ్‌ రౌత్‌ తొలుత ప్రత్యేక కోర్టు ఈ నెల 4 వరకు కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఇదే కేసులో సంజయ్ రౌత్‌ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ అధికారులు తనను కిటికీ లేని, గాలి, వెలుతురు సరిగ్గా రాని రూంలో ఉంచారని న్యాయస్థానానికి వివరించారు సంజయ్ రౌత్‌. గాలి వెలుతురు ఉండే రూంను కేటాయించాలని కోరారు.

Tags

Next Story