Hemant Soren: ఝార్ఖండ్‌ సీఎం ఇంటికి ఈడీ అధికారులు

Hemant Soren: ఝార్ఖండ్‌ సీఎం ఇంటికి ఈడీ అధికారులు
ఈడీ ప్రశ్నల వర్షం- 7గంటలకుపైగా విచారణ

భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో Hemant Soren: ఝార్ఖండ్‌ సీఎం ఇంటికి ఈడీ అధికారులును...ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌-ED అధికారులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సోరెన్‌ అధికార నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులకు CISFరక్షణ కల్పించారు. పశ్చిమ బంగాల్‌లో ఇటీవల ఈడీ అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో...ఈ మేరకు భద్రత కల్పించారు. సోరెన్‌ నివాసం చుట్టూ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసేందుకు వీలుగా CISF బృందాలు హై-రిజల్యుషన్‌ బాడీ కెమెరాలు వినియోగిస్తున్నాయి. విల్లు, బాణాలు పట్టుకొని JMMశ్రేణులు తరలిరావటంతో సీఎం నివాసానికి వంద మీటర్ల దూరంలో పోలీసులు వారిని నిలిపివేశారు. అధికార ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా-JMMకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ ఈడీ అధికారులు గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదు. ఎనిమిదోసారి సమన్లు ఇవ్వటంతో విచారణకు అంగీకరించారు.


జార్ఖండ్‌లో భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన రంజన్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్‌ చేశారు.కాగా, భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ ఇప్పటికే ఏడుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నెలలో జారీ చేసిన చివరి సమన్లకు కూడా ఆయన స్పందించలేదు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే అన్ని పత్రాలను ఈడీకి పంపినట్లు ఆయన తెలిపారు. తనకు సమన్లు జారీ చేయడం అక్రమం అని ఆరోపించారు. సమన్లకు హేమంత్‌ సోరెన్‌ స్పందించకపోవడంతో ఈడీ అధికారులు శనివారం ఆయన ఇంటికి వచ్చి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈడీ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

Tags

Read MoreRead Less
Next Story