Karnataka : ఈడీ ముందుకు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్..

Karnataka : మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో హాజరయ్యారు. ఏపీజే అబ్దుల్‌కలాం రోడ్డులో ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. గేట్ వద్ద ఉన్న కౌంటర్‌లో నోటీసులు చూపించి లోనికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ గతవారం సమన్లు జారీచేసింది. అయితే, అవి ఏకేసులో తెలియదని డీకేఎస్‌చెబుతున్నప్పటికీ.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసులోనే ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రతోపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతోన్న సమయంలో ఈడీ సమన్లు జారీచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు డీకే శివకుమార్. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగానే ఉన్నప్పటికీ కీలక సమయంలో వేధింపుల వల్ల తన రాజ్యాంగ, రాజకీయపరమైన విధుల నిర్వహణకు ఆటంకం కలిగే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ, ఈడీ సమన్ల నేపథ్యంలో ఢిల్లీలోని దర్యాప్తు కార్యాలయంలో హాజరైనట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com