Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

Raj Kundra:  పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
X
కేసులో నిందితులుగా పూనంపాండే, షెర్లీన్ చోప్రా, ఉమేశ్ కామత్‌

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన పోర్న్ రాకెట్ కేసులో ఈడీ మరోమారు రంగంలోకి దిగింది. ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇల్లు, కార్యాలయాల్లో ఈ ఉదయం సోదాలు నిర్వహించింది. కుంద్రా సహచరుల ఆవరణల్లోనూ సోదాలు నిర్వహించింది.

అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్న ఆరోపణలపై జూన్ 2021లో కుంద్రా ఒకసారి అరెస్ట్ అయ్యారు. రెండు నెలల తర్వాత సెప్టెంబర్‌లో బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసులో కుంద్రా ప్రధాన ముద్దాయిగా ఉన్నట్టు ముంబై పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరి 2021లో పోలీసులు ఈ పోర్నోగ్రఫీ రాకెట్‌ను గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో నలుగురిని అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని ఔత్సాహిక మోడళ్లు, యువతులను నమ్మించి బలవంతంగా వారితో అశ్లీల చిత్రాలు తీసేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ముంబైలోని అపార్ట్‌మెంట్లు, అద్దెకు తీసుకున్న బంగ్లాలలో షూటింగ్ చేసేవారని తెలిసింది. నటించేందుకు నిరాకరిస్తే బెదిరించడమే కాకుండా, ప్రొడక్షన్‌కు అయిన సొమ్ము చెల్లించాలని బెదిరించేవారు. ఇలా షూట్ చేసిన క్లిప్‌లను సబ్‌స్క్రిప్షన్ ఆధారిత యాప్స్‌లో అప్‌లోడ్ చేసేవారు. వాటిని చూడాలనుకుంటే యూజర్లు కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ కేసులో కుంద్రా సహా పూనం పాండే, షెర్లీన్ చోప్రా, ఉమేశ్ కామత్‌లు కూడా నిందితులుగా ఉన్నారు.

Tags

Next Story