Jobs Scam: బెంగాల్ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు

మున్సిపల్ ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తున్నది. అగ్నిమాక శాఖ మంత్రి సుజిత్ బోస్ నివాసంతోతోపాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఇండ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకుల ఇండ్లలో ఉదయం 6.40 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.
మున్సిపాలిటీల్లో రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై గతేడాది ఏప్రిల్‌లో కోల్‌కతా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీతో సీబీఐతోపాటు ఈడీ కూడా రంగంలోకి దిగి మున్సిపాలిటీల్లో అవకతవకలపై లోతుగా విచారణ జరుపుతున్నాయి. ఇందులో భాగంగా జూన్ 7న నోయిడా, హుగ్లీ, ఉత్తర 24 పరగాణల జిల్లాతోపాటు సాల్ట్ లేక్ మున్సిపాలిటీలో సోదాలు నిర్వహించిన సీబీఐ పలు కీలక పత్రాలను సీజ్ చేసింది. కాగా, సీబీఐ దర్యాప్తును ఆపాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో పౌరసరఫరాల శాఖ మంత్రి రతిన్ ఘోష్ నివాసంతోపాటు పలు ప్రాంతాల్లో గత అక్టోబర్ 5న ఈడీ దాడులు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com