Nirav Modi: నీరవ్ మోదీకి ఈడీ షాక్.. సుమారు రూ.253 కోట్ల 62 లక్షల విలువైన ఆస్తులు జప్తు..

Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు షాక్ ఇచ్చింది. నీరవ్‌కు చెందిన సుమారు 253 కోట్ల 62 లక్షల విలువైన ఆస్తులను హంకాంగ్‌లో జప్తు చేసింది. వీటితో పాటు SAR, చైనాలోని నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులు జప్తు చేసినట్లు ప్రకటించింది. మనీలాండరింగ్ చట్టం కింద జప్తు చేసినట్లు పేర్కొంది.
పలు బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తు మొదలయ్యే ముందే నీరవ్ మోదీ దేశం విడిచి పరారయ్యారు. ప్రస్తుతం బ్రిటన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు నీరవ్ మోదీ. ఈ కేసులో ఆయనకు చెందిన అనేక ఆస్తులు, అభరణాలతో పాటు.. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఈడీ జప్తు చేసింది. నీరవ్ మోదీ, అతని కంపెనీ 6 వేల 498 కోట్ల 20 లక్షల మోసం వ్యవహారంలో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేపట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com