Maharashtra Politics : శివసేనకు షిండే దెబ్బ మీద దెబ్బ..

Maharashtra Politics : శివసేనకు షిండే దెబ్బ మీద దెబ్బ..
Maharashtra Politics : 45 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న షిండే.

Maharashtra Politics : మహారాష్ట్రలో శివసేన సర్కారును కూల్చి అధికార పీఠం దక్కించుకున్న సీఎం ఏక్‌నాథ్ షిండే.. కొత్త కేబినెట్ ఏర్పాటుపై దృష్టి పెట్టారు. 45 మంది మంత్రులతో మంత్రివర్గాన్నిఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న షిండే.. కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలి? ఎవరికి స్థానం కల్పించాలనే దానిపై బీజేపీతో కలిసి కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి చెందిన 25 మంది, షిండేవర్గంలోని శివసేన నుంచి 13 మంది మంత్రులు ఉంటారని తెలుస్తోంది. వారితో పాటు స్వతంత్రులకు సైతం షిండే మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు సమాచారం. సీఎం షిండే, డిప్యూటీ సీఎందేవేంద్ర ఫడ్నవీస్ మినహా అందరూ కొత్తవారినే మంత్రివర్గంలో తీసుకుంటారని షిండే వర్గం చెబుతోంది.

ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే కేబినెట్ కూర్పు ఉండబోతోంది. శివసేనతో ప్రతీ ముగ్గురు ఎమ్మెల్యేలకు, బీజేపీలో ప్రతీ నలుగురు ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి ఇవ్వాలనినిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే షిండేతో సహా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఇటీవల ఉద్దవ్ సర్కారు అనర్హత వేటు వేసింది. దీనిపై జూలై 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. సుప్రీంకోర్టుతీర్పు తర్వాతే మంత్రివర్గం ఏర్పాటుపై షిండే, బీజేపీ కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక.. షిండే కేబినెట్‌ ఏర్పాటులో మహా బిజీగా ఉంటూనే.. మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రేకు షాకుల మీదు షాకులు ఇస్తున్నారు. తిరుగుబాటు చేసి ఉద్దవ్‌ను గద్దె దింపిన షిండే.. ఇపుడు ఆపరేషన్ శివసేనమొదలుపెట్టారు. ఉద్దవ్ శిబిరంలో ఉన్న నేతలు, కార్పొరేటర్లను ఒక్కొక్కరినీ తన వర్గంలోకి లాగేసుకుంటున్నారు. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని శివసేనకు చెందిన 66 మంది కార్పొరేటర్లు ఏక్‌నాథ్‌షిండే వర్గంలో చేరారు. రాత్రి సీఎం ఏక్‌నాథ్‌ షిండే నివాసంలో భేటీ అయ్యారు. 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో బీఎంసీపై ఉద్ధవ్ థాక్రే అధికారాన్ని కోల్పోయారు.ఇప్పటికే అధికారం కోల్పోయి తలపట్టుకుంటున్న ఉద్దవ్‌కు కార్పొరేటర్లు షాక్ ఇవ్వడంతో మరింత చిక్కుల్లో పడ్డారు.

శివసేనకు ఉన్న18 మంది ఎంపీల్లో 12 మంది త్వరలో షిండే వర్గంలో చేరతారని శివసేన రెబల్ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే షిండే,రెబల్స్ తిరుగుబాటుతోసర్కారు కోల్పోయారు ఉద్దవ్ థాక్రే. ఇప్పుడు ఉన్న ఎంపీలు కూడా షిండే పంచన చేరిపోతే ఉద్దవ్ మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మరి.. షిండే-బీజేపీ ఆపరేషన్‌ శివసేనకు ఉద్దవ్ ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story