Eknath Shinde : ఏక్‌నాథ్‌ షిండే ‘ఎక్స్‌’ ఎకౌంట్‌ హ్యాక్‌.. పాక్, టర్కీ జెండాలు పోస్ట్‌ చేసిన హ్యాకర్లు

Eknath Shinde :  ఏక్‌నాథ్‌ షిండే ‘ఎక్స్‌’ ఎకౌంట్‌ హ్యాక్‌.. పాక్, టర్కీ జెండాలు పోస్ట్‌ చేసిన హ్యాకర్లు
X
45 నిమిషాల తర్వాత పునరుద్ధరించినట్లు ప్రకటన

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కు చెందిన ఎక్స్‌ ఖాతా హ్యాక్‌ అయింది. ఈ క్రమంలో హ్యాకర్లు ఆయన అకౌంట్‌లో పాకిస్థాన్‌, తుర్కియే దేశాల జెండాలు ఉన్న పోస్టులను షేర్‌ చేయడం కలకలం రేపుతోంది.

ఆసియా కప్‌లో భారత్‌- పాక్‌ల మధ్య నేడు మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో శిందే ఖాతా నుంచి ఆ దేశాల ఫొటోలను పోస్టు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. శిందే కార్యాలయం దీన్ని వెంటనే గుర్తించి అప్రమత్తమైంది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం కూడా ఇచ్చింది. దాదాపు 30-45 నిమిషాల తర్వాత అకౌంట్‌ తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎలాంటి సున్నితమైన సమాచారం బయటకు వెలువడలేదని వెల్లడించింది. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, ఏక్‌నాథ్‌ షిండే ‘ఎక్స్‌’ ఎకౌంట్‌ను పర్యవేక్షించే అధికారి దీనిని గమనించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో సుమారు 45 నిమిషాల తర్వాత హ్యాక్‌ అయిన ఏక్‌నాథ్‌ షిండే ‘ఎక్స్‌’ ఖాతాను పునరుద్ధరించినట్లు ఆ అధికారి వెల్లడించారు. ఇటీవల ఉన్నతస్థాయి వ్యక్తుల సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ హ్యాకింగ్‌కు గురి కావడం తీవ్ర కలకలం రేపుతుంది.

Tags

Next Story