చెన్నై వీధుల్లో భిక్షాటన చేస్తున్న వృద్ధురాలు.. ఇంగ్లీషులో అనర్గళంగా..

చెన్నై వీధుల్లో భిక్షాటన చేస్తున్న వృద్ధురాలు.. ఇంగ్లీషులో అనర్గళంగా..
మయన్మార్ కి చెందిన 81 ఏళ్ల మెర్లిన్, ఒకప్పుడు తన ప్రస్తుత పరిస్థితులకు భిన్నంగా జీవితాన్ని గడిపింది.

ఒకప్పుడు ఉపాథ్యాయురాలు.. ఇప్పుడు యాచకురాలు. విధి చూసిన చిన్న చూపుకు ఆమె బలి అయింది. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే అనుకోవలసింది ఏం ఉంటుంది. ఆమె జీవితం ఇప్పుడు రోడ్డున పడింది. భిక్షాటన చేస్తూ జీవితం వెళ్లదీస్తోంది.

మయన్మార్ కి చెందిన 81 ఏళ్ల మెర్లిన్, ఒకప్పుడు తన ప్రస్తుత పరిస్థితులకు భిన్నంగా జీవితాన్ని గడిపింది. కానీ ఇప్పుడు ఆమె వీధుల్లో బిచ్చమెత్తుకుంటోంది. నా అన్నవారు లేక, నిలువ నీడ లేక ఓ చెట్టుకిందే ఆశ్రయం పొందుతోంది.

చెన్నైలోని సందడిగా ఉండే వీధుల్లో, మొహమ్మద్ ఆషిక్ అనే యువకుడు మెర్లిన్ అనే వృద్ధ మహిళతో సంభాషించాడు. ఆమె మాట తీరుతో పాటు, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడడం చూసి యువకుడు హాతాశుడయ్యాడు. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పెద్ద వయసు వచ్చిన వారి పట్ల ఇంట్లో వారు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఈమె జీవితం మరోసారి తెలుపుతుంది.

మయన్మార్ కి చెందిన మెర్లిన్ భారతీయుడిని వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడింది. మంచి జీవితం గడిపింది. పాఠశాల ఉపాధ్యాయురాలిగా విద్యార్ధులకు బోధన చేసినట్లు తెలిపింది. కాల క్రమంలో కుటుంబ సభ్యులందరూ మరణించారు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. జీవనం కోసం కష్టపడుతోంది.

మెర్లిన్ కథకు ఆషిక్ చలించిపోయాడు. ఆమె జీవితంలో మార్పు తేవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు చీరను బహుమతిగా ఇచ్చాడు. ఇంగ్లీష్ ట్యూషన్ అందించడానికి ముందుకొచ్చాడు. ఆషిక్ తన మాటను నిజం చేస్తూ "ఇంగ్లీష్ విత్ మెర్లిన్" పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించాడు. వృద్ధురాలు ఇప్పుడు మళ్లీ కొత్త జీవితాన్ని ఆరంభించింది.. ఇంగ్లీషులో ఆకర్షణీయమైన కథలు చెబుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది.

మెర్లిన్ కథనం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. వీడియో ఎంత విలువైనదో అని చాలా మంది వ్యాఖ్యానించారు.



Tags

Read MoreRead Less
Next Story