Maharashtra politics : షిండే వర్గానికి కొత్త పార్టీ గుర్తులు కేటాయింపు..

Maharashtra politics : షిండే వర్గానికి కొత్త పార్టీ గుర్తులు కేటాయింపు..
X
Maharashtra Politics : మహారాష్ట్రలోని అంథేరి ఈస్ట్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో తలెత్తిన సింబల్‌ సమస్యను ఎన్నికల సంఘం పరిష్కరించింది

Maharashtra Politics : మహారాష్ట్రలోని అంథేరి ఈస్ట్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో తలెత్తిన సింబల్‌ సమస్యను ఎన్నికల సంఘం పరిష్కరించింది.. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి రెండు కత్తులు, ఒక డాలు గుర్తును కేటాయించింది.. అలాగే పార్టీ పేరుగా బాలసాహెబ్‌ శివసేన పేరును ఖరారు చేసింది.

షిండే వర్గం మూడు పేర్లను సూచించినప్పటికీ వాటిని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.. కొత్త జాబితా పంపాలని ఆదేశించడంతో.. కత్తులు, డాలు గుర్తుతోపాటు రావిచెట్టు, సూర్యుడు గుర్తులను పంపింది.. పరిశీలన అనంతరం రెండు కత్తులు, ఒక డాలు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అటు కాగడా గుర్తును థాక్రే వర్గానికి కేటాయించింది.

Tags

Next Story