Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల..

Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల..
X
సెప్టెంబర్ 9న పోలింగ్.. ఫలితాలు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను పోలింగ్ రోజే.. అనగా సెప్టెంబర్ 9నే ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. జూలై 22న జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.

ఆగస్టు 7న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆగస్టు 21 చివరి తేదీ కానుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రేసులో బీజేపీ సీనియర్లు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఎన్డీఏకు పూర్తి మద్దతు ఉంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేవు. లోక్‌సభలో 542 మంది సభ్యుల్లో ఎన్డీఏకి 293 మంది మద్దతు ఉంది. నామినేటెడ్ సభ్యులు కూడా నామినీకి మద్దతుగా ఓటు వేస్తే పాలక కూటమికి 422 మంది సభ్యుల మద్దతు ఉంటుంది.

ధన్‌ఖడ్‌ రాజీనామా..

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీచేశారు. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన రాజీనామాతో దేశంలో అత్యున్నత స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది.

ఉపరాష్ట్రపతి రేసులో..

తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు జనతాదళ్‌ (యునైటెడ్‌) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారు. ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా లేదంటే ఢిల్లీ ఎల్జీ సక్సేనాలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చనడుస్తోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేరుకూడా రేసులోకి వచ్చింది. దీంతో ఈ పదవి చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story