Hemant Soren : ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌‌కు ఎన్నికల కమిషన్ షాక్..

Hemant Soren : ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌‌కు ఎన్నికల కమిషన్ షాక్..
X
Hemant Soren : ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హతా వేటు వేయాలని ఎన్నికల సంఘం సూచించింది

Hemant Soren : ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హతా వేటు వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు గవర్నర్‌కు ఈసీ లేఖ రాసింది. అక్రమ మైనింగ్‌ కేసులో సీఎం హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇలా సూచనలు చేసింది.

సీఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయ సన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఇప్పటికే ఈ అంశంపై విచారణ చేపట్టింది. మిశ్రా అసోసియేట్ బచ్చు యాదవ్‌నూ ప్రశ్నించింది ఈడీ. ఆ తరవాత ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.100 కోట్లు సంపాదించారన్న అనుమానాల నేపథ్యంలో దూకుడు పెంచింది.

జులై 8న మిశ్రాతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు ఈడీ అధికారులు. మొత్తం 50 బ్యాంక్ ఖాతాల్లోని రూ.13.32 కోట్లను జప్తు చేసింది. మార్చిలోనే మిశ్రాపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. అయితే...దీనిపై స్పందించిన పంకజ్ మిశ్రా..తనను అన్యాయంగా ఈ స్కామ్‌లో ఇరికించారని మండి పడ్డారు.

అయితే ఈడీ మాత్రం కచ్చితంగా కుంభకోణం జరిగిందని స్పష్టం చేస్తోంది. విచారణలో భాగంగా పలు ఆధారాలు, స్టేట్‌మెంట్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లు సేకరించినట్టు వెల్లడించింది. సాహిబ్‌గంజ్‌లో అక్రమ మైనింగ్‌తో కోట్ల రూపాయలు సంపాదించారనటానికి ఆధారాలున్నట్టు తెలిపింది. అటవీ ప్రాంతంలోనూ మైనింగ్ చేశారని స్పష్టం చేసింది.

Tags

Next Story