Elections in 2022: వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..

Elections in 2022 (tv5news.in)
Elections in 2022: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. షెడ్యూలు ప్రకారమే నిర్వహిస్తామని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎలాంటి వాయిదాలు ఉండవని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో మూడ్రోజుల పాటు పర్యటించింది కేంద్ర ఎన్నికల సంఘం. యూపీలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు నిర్వహించాలనే తమకు సూచించాయన్నారు కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర.
కొవిడ్ నిబంధనలను అనుసరించి.. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎన్నికలు జరపాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరించిన ఆయన.. ఎన్నికలు స్వేచ్చగా, ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఓటర్ల సురక్షితకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇందుకోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తుది ఓటరు జాబితా జనవరి 5న విడుదల అవుతుందన్నారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com