Electric Car : ఎలక్ట్రిక్ కారులో మంటలు, చూస్తుండగానే ...

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతుండటంతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్ లు, కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం చూశాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది కూడా మరణించారు. అయితే ఆ తరువాత మరింత పకడ్బందీగా కంపెనీలు ఈవీల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే స్కూటర్ల విషయాన్ని పక్కన పెడితే, కార్లలో మాత్రం మంటలు చెలరేగడం చాలా అరుదుగా చూశాం.
తాజాగా బెంగళూర్ లో నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రిక్ కారు అగ్నికి ఆహుతైంది. కారు పూర్తిగా కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 30న బెంగళూర్‌లోని జేపీనగర్‌లో ఈ ఘటన జరిగింది.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు కాలిపోతున్న సమయంలో జనాలు దూరంగా దూరంగా ఉన్నారు. అటు వైపుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు. . సడెన్ గా కారు నుంచి పేలుడు కూడా సంభవించింది.
గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను తనిఖీ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అనేక ఈవీ కంపెనీలు తమ తమ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేశాయి. అయితే ఇప్పుడు కార్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com