Odisha: వృద్ధురాలిపై ఏనుగు పగ.. చితిపై నుండి లాగి మరీ దాడి..

Odisha: నోరు లేని జీవాలకు కూడా పగలు, ప్రతీకారాలు ఉంటాయని అంటుంటారు. అప్పుడప్పుడు కొన్ని జంతువులు ప్రవర్తించే తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంటుంది. మనుషులపై దాడి చేసి చంపే జంతువుల్లో ఏనుగు కూడా ఒకటి. ఏనుగు దాడి వల్ల మనుషులు మృతిచచెందడం గురించి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కానీ ఒకే మనిషిపై మళ్లీ మళ్లీ దాడి చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అలాంటి ఓ ఘటనే ఇటీవల ఒడిశాలో చోటుచేసుకుంది.
ఒడిశా మయుర్‌భంజ్ జిల్లా రాయ్‌పాల్ గ్రామంలో మాయా ముర్ము అనే ఓ వృద్ధురాలు బావి దగ్గర నీళ్లు తోడుతున్న సమయంలో తనపై ఏనుగు దాడి చేసింది. కిందపడేసి తొక్కింది. దీంతో ఆ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. దీంతో అదే రోజు సాయంత్రం తనకు అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. తనపై దాడి చేసిన ఏనుగు అక్కడికి మళ్లీ వచ్చి్ంది.
చితిపై ఉన్న మాయా ముర్ము మృతదేహంపై మరోసారి దాడి చేసింది ఏనుగు. మృతదేహాన్ని కింద పడేసి మరోసారి తొక్కింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సినిమాల్లో తప్ప నిజ జీవితంలో జంతువులు మనుషులపై పగ తీర్చుకోవడం గురించి పెద్దగా వినుండం కాబట్టి ఇది అలాంటి ఓ సంఘటన అని స్థానికులు అనుకుంటున్నారు. ఏనుగు అక్కడి నుండి వెళ్లిపోయిన కాసేపటి తర్వాత వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com