Elon Musk ట్రం; ప్‌తో విభేదాల తర్వాత.. తొలిసారి వైట్‌హౌస్‌కు మస్క్

చాలా రోజుల తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమయ్యారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ సౌదీ యువరాజుకు ఇచ్చిన ప్రత్యేక విందులో మస్క్ దర్శనమిచ్చారు. అధ్యక్షుడితో వైరం తర్వాత మస్క్ వైట్‌హౌస్‌లో ప్రత్యక్షం కావడంతో వార్త హల్‌చల్ చేస్తోంది.
గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-మస్క్ ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించాక కూడా ట్రంప్ ఎక్కడుంటే అక్కడ ఉండేవారు. ఓవల్ కార్యాలయంలో కొడుకును భుజాలపై ఎక్కించుకుని ట్రంప్ పక్కనే మస్క్ ఉండేవాడు. అలాంటిది ఎప్పుడైతే ట్రంప్.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు తీసుకొచ్చారో అప్పటి నుంచి వైరం మొదలైంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా మస్క్ చాలా విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతిని దూరమైపోయారు.
ఆ మధ్య వైట్‌హౌస్‌లో ఐటీ దిగ్గజ కంపెనీ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఆ విందులో మస్క్ కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య సఖ్యత పూర్తిగా దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే ఇటీవల ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మంగళవారం వైట్‌హౌస్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ట్రంప్ ఇచ్చిన విందులో మస్క్ కనిపించారు. ఇక ట్రంప్ లోపలికి వస్తూ.. మస్క్‌ను ప్రత్యేకంగా భుజం తట్టారు. ఇక విందులో మస్క్ చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించారు.
ఇక సౌదీ-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ఇక సౌదీ రాజును ట్రంప్ దంపతులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. విందులో పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

