Elon Musk: రష్యన్ మహిళలతో బిల్ గేట్స్ అఫైర్స్ వార్తలపై మస్క్ సంచలన వ్యాఖ్యలు

Elon Musk: రష్యన్ మహిళలతో బిల్ గేట్స్ అఫైర్స్ వార్తలపై  మస్క్ సంచలన వ్యాఖ్యలు
X
‘‘కర్మ ఈజ్ రియల్” అంటూ కామెంట్ చేసిన టెస్లా చీఫ్

టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్ మరియు బిల్‌ గేట్స్ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ గతంలో వివాదాస్పద వ్యక్తి జెఫ్రీ ఎప్ స్టీన్‌ తో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు, అలాగే ఇద్దరు రష్యన్ మహిళలతో ఆయనకున్న అఫైర్లపై తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికను వెలువరించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ (ట్విట్టర్) యూజర్ ఒకరు పెట్టిన పోస్ట్‌కు "Karma is real" (కర్మ అనేది నిజం) అంటూ మస్క్ కామెంట్ పెట్టారు.

టెస్లాపై బిల్ గేట్స్ షార్ట్ సెల్లింగ్..

బిల్‌ గేట్స్ గతంలో టెస్లా కంపెనీ షేర్ల విలువ పడిపోతుందంటూ సుమారు 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,150 కోట్లు) ‘షార్ట్ పొజిషన్’ తీసుకున్నారు. దీనిని ఉటంకిస్తూ ఒక యూజర్.. "టెస్లా షార్ట్ సెల్లర్లకు నైతిక విలువలు ఉండవని ఇప్పుడే అర్థమైంది" అని పోస్ట్ చేశారు. దీనికి మస్క్ ‘కర్మ’ గురించి ప్రస్తావిస్తూ గేట్స్ వ్యక్తిగత వివాదాలను ఎద్దేవా చేశారు.

వీరిద్దరి మధ్య ఘర్షణకు ప్రధాన కారణం టెస్లా స్టాక్ మార్కెట్ బెట్టింగ్. దీనిపై గతంలో ఒక ఇంటర్వ్యూలో గేట్స్ మాట్లాడుతూ.. తాను షార్ట్ పొజిషన్ తీసుకున్న విషయంపై మస్క్ తనకు నేరుగా మెసేజ్ చేసి నిలదీశారని ఒప్పుకున్నారు. అదేసమయంలో ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమం కలిసి చేద్దామా అని గేట్స్ అడగ్గా.. మస్క్ నిర్మొహమాటంగా తిరస్కరించారు. "పర్యావరణాన్ని కాపాడే టెస్లా కంపెనీ పతనం కావాలని కోరుకుంటూ, మళ్లీ పర్యావరణం కోసం కలిసి పని చేద్దామనడం హాస్యాస్పదం.. మీ మాటలను నేను సీరియస్‌గా తీసుకోలేను" అని మస్క్ బదులిచ్చారు.

గత ఎనిమిదేళ్లుగా గేట్స్ టెస్లాపై ఈ ‘క్రేజీ’ షార్ట్ పొజిషన్‌ను కొనసాగిస్తున్నారని మస్క్ మండిపడ్డారు. ‘‘ఒకవేళ టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగితే, ఆ షార్ట్ పొజిషన్ వల్ల బిల్‌ గేట్స్ వంటి కుబేరుడు కూడా దివాళా తీయడం ఖాయం’’ అని మస్క్ హెచ్చరించారు.

Tags

Next Story