Sanjay Raut : సంజయ్ రౌత్‌ ఇంటిపై ఈడీ రైడ్స్..

Sanjay Raut : సంజయ్ రౌత్‌ ఇంటిపై ఈడీ రైడ్స్..
Sanjay Raut : శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు షాక్‌ ఇచ్చింది ఈడీ.

Sanjay Raut : శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు షాక్‌ ఇచ్చింది ఈడీ. సంజయ్‌ రౌత్‌ నివాసంలో ఈ ఉదయం ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచల్‌ భూకుంభకోణం కేసు విచారణలో భాగంగా ఈడీ తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. సంజయ్‌ రౌత్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈడీ అధికారులు సోదాలు చేపట్టారనే ప్రచారం జరుగుతోంది.

పత్రాచల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో.. ఇప్పటికే రెండుసార్లు సమన్లను జారీ చేసింది ఈడీ. ఈనెల 1న ఈడీ విచారణకు హాజరయ్యారు సంజయ్ రౌత్. మళ్లీ 20వ తేదీన రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే, పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఆగస్ట్‌ 7వ తేదీన ఈడీ ఆఫీసుకు వస్తానంటూ సమాచారం అందించారు. కాని, ఈలోపే ఈడీ రంగంలోకి దిగింది.

ఇవాళ తెల్లవారుజామున ముంబైలోని రౌత్‌ ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు.. సంజయ్‌రౌత్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. సంజయ్‌ రౌత్‌ ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మోహరించాయి. పత్రాచల్‌ మనీలాండరింగ్‌ కేసులో దాదర్‌, అలిబాగ్‌లోని సంజయ్‌ రౌత్‌ ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్‌ చేసింది.

Tags

Next Story